MNCL: హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో దర్వాజా రాజయ్య నివాసంలో జరిగిన దొంగతనం ఘటనలో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు సీఐ గోపతి రవీందర్ తెలిపారు. నిందితులు తోకల రమేశ్, తౌటం అశోక్‌ను దొనబండ బస్టాప్ వద్ద అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేశామని, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు వెల్లడించారు.