RR: మియాపూర్లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 80 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, నలుగురు దివ్యంగులకు స్కూటీలను అందజేశారు. ప్రజాపాలన-పోషణ్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో మెరుగైన సేవల కోసం టెక్నాలజీని వాడాలని ఆయన సూచించారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన కోరారు.