AP: అమరావతి రైతులతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. అమరావతికి చట్టబద్ధత రావడంతో ల్యాండ్ పూలింగ్‌కు రైతుల నుంచి భారీ స్పందన వచ్చిందని మంత్రి తెలిపారు. ఒకే రోజు వెయ్యి ఎకరాల భూమిని రైతులు ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతిని ఎవరూ కదిలించలేరని పేర్కొన్నారు.