ఎండల తీవ్రతతో వరి పంటలు ఎండిపోతున్న తరుణంలో, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవేంద్ర రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. ధరూరు మండలం ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి పిల్ల కాలువల్లో జమ్ము, చెట్లు, చెత్తాచెదారం అడ్డంగా మారడంతో పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన ఆయన ఇవాళ కలువను క్లీన్ చేయించే పనులు ప్రారంభించారు.