SRCL: వీర్నపల్లి మండలం తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 6వ నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈనెల 19వ తేదీన జరగనుందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అశోక్ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 వరకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.