ఆదిలాబాద్: లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ ఆశావహుల లెక్కలు తలకిందులయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ స్థానాలు పెరిగి, కొత్తగా లోక్ సభ స్థానం వస్తుందని ఆశించిన నేతలకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు అమలైతే తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకున్న మహిళా నేతల కలలు చెదిరిపోయాయి.