KNR: ఇల్లందకుంట పొలీస్ స్టేషన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా కానిస్టేబుల్ శనిగరం సౌజన్యకు అవార్డు లభించింది. కరీంనగర్ కమిషనరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ గౌస్ ఆలాం చేతుల మీదుగా ఆమెకు అవార్డు అందజేశారు. విధుల్లో క్రమశిక్షణ, ప్రతిభ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు.