విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీ లీక్పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ‘ఇది యాదృచ్ఛికం కాదు. వ్యవస్థ విఫలం కావడం వల్ల జరిగింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీంతో పైరసీకి అవకాశం ఏర్పడింది. పైరసీ అనేది రాజకీయాలకు అతీతమైనది. ఇది కళ, కళాకారుడిపై దాడి’ అని ‘X’లో పోస్టు చేశారు.