SDPT: జిల్లాలో వరుసగా ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందులాల్ అలియాస్ మధులాల్ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వివిధ జిల్లాల్లో సుమారు 48 కేసుల్లో రూ.10 లక్షల విలువైన వైరును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.6.70 లక్షల నగదు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.