PDPL: తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కో-కన్వీనర్‌గా గోదావరిఖనికి చెందిన బిక్కినేని నర్సింగరావు నియమితులయ్యారు. వేదిక రాష్ట్ర ఛైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ ఈ మేరకు ఉత్తర్వులు అందజేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేదికను బలోపేతం చేస్తామని, పేర్కొన్నారు.