TG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. కుంగుబాటుకు గురైన బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.