MDK: జిల్లాలో ఈ నెల 13 నుంచి 18 వరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే ఈ వారం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.