GDWL: జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలంపూర్ ఎస్సై రామకృష్ణ సూచించారు. అత్యవసర పనులు ఉంటే ఉదయం 7 నుంచి 9 గంటల లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాతే చూసుకోవాలని కోరారు. ఎండ దెబ్బ తగలకుండా ప్రతిరోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు సేవించాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని హితవు పలికారు.