TG: డిజిటిల్ సేవల్లో ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ విభాగం సేవలను వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్లో పొందే అవకాశం అందుబాటులోకి తెచ్చినట్లు మీసేవ కమిషనర్ టి.రవికిరణ్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడ నుంచైనా భూమి సంబంధిత వివరాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 8096958096కు హాయ్ అని పెట్టి సేవలు పొందండి.