NLR: కుటుంబ కలహాల నేపథ్యంలో దగదర్తి మండలం తురుమెళ్ల పంచాయతీ లక్ష్మి నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు. కుటుంబ సభ్యులు 112 కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే దగదర్తి ఎస్సై జంపాని కుమార్ తమ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆత్మహత్యాయత్నంకు పాల్పడుతున్న వ్యక్తిని లొకేషన్ ఆధారంగా కాపాడారు.