MBNR: జిల్లా కేంద్రంలో సెలవు దినాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. ముఖ్యంగా క్రిస్టియన్ పల్లి నుంచి టీచర్స్ కాలనీ పరిసర ప్రాంతాలకు సాయంత్రం వేళల్లో నేరుగా బెంజ్ వాహనాలు, ఆదివారం రోజుల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఆన్లైన్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.