TG: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మెడికోలు రీల్స్ చేసిన వ్యవహారం దుమారం రేపుతోంది. విధుల్లో ఉండగా ఇలాంటి పనులు చేయడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రిమ్స్ డైరెక్టర్ ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. బాధ్యులెవరో గుర్తించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సదరు మెడికోలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.