HYD: నీటిని పొదుపుగా వాడాలని HYD జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడంతో తాగునీటి డిమాండ్ అధికమైందన్నారు. ప్రతి కుటుంబం కనీసం 20% నీటిని ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై సమీక్ష నిర్వహించి సరఫరా మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు. నీటి వృథాను తగ్గించడం అత్యవసరమన్నారు.