SRPT: అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన షేక్ నౌషీన్ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభకనబరిచింది. ఆటో డ్రైవర్ షేక్ షరీఫ్ కుమార్తె అయిన నౌషీన్, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతూ ద్వితీయ సంవత్సరంలో 1000/993 మార్కులు సాధించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి కష్టాన్ని వృథా చేయకుండా ఆమె సాధించిన ఈ విజయం అద్భుతమని గ్రామస్థులు కొనియాడారు.