NZB: సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ ఉమ్మడి సర్పల్లి తండాలోని అన్నపూర్ణమ్మ కాలనీలో కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం ఏర్పాటు చేశారు. సర్పంచ్ చందర్ నాయక్ ఆధ్వర్యంలో ఏఈ చంద్రశేఖర్ సహకారంతో ఈ ప్రక్రియ పూర్తయింది. కొన్ని రోజులుగా విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు తెలిపారు. కొత్త ట్రాన్స్ఫార్మర్తో సరఫరా పునరుద్ధరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.