JGL: కథలాపూర్ మండలం ఇప్ప పెల్లి గ్రామ శివారులోని చెక్ డ్యామ్ ను నీటిపారుదల శాఖ ఈఈ ప్రశాంత్ పరిశీలించారు. చెక్ డ్యామ్ గోడలు కూలిపోవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులపై స్థానిక రైతులతో చర్చించారు. ఈ వర్షాకాలం లోపు చెక్ డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టాలని అధికారులను రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నవీన్, తదితరులు పాల్గొన్నారు.