VKB: వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా వెంకటాచారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.