AP: రాయలసీమను YCP రాజకీయం కోసమే వాడుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమకు YCP ఏం చేసిందో చెప్పాలన్నారు. ఆ ప్రాంతంపై ప్రేమ ఉంటే.. ఎంత ఖర్చు పెట్టారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీమలో హార్టికల్చర్ హబ్ పెడతామని చెప్పామని.. చేస్తామని స్పష్టం చేశారు. YCP మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఏం చేశారని నిలదీశారు.