NLG: సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం తరపున స్థానిక మైనారిటీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మైనారిటీ పట్టణ అధ్యక్షుడు మతీన్ మాట్లాడుతూ.. అనారోగ్యం, ఇతర ఆపదల్లో ఉన్న పేదలకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.