TG: రాష్ట్రంలో మళ్లీ RTC సమ్మె సెగ మొదలుకానుంది. ఈనెల 23 నుంచి సమ్మెకు వెళ్లేందుకు RTC జేఏసీ సిద్ధమవుతోంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ నెల 13న లేబర్ కమిషనర్, RTC యాజమాన్యంతో జేఏసీ కీలక చర్చలు జరపనుంది. ఆ సమావేశం తర్వాతే సమ్మెపై పూర్తి స్పష్టత ఇస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. చర్చల ఫలితాన్ని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వారు స్పష్టం చేశారు.