TG: దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేంద్ర బిందువుగా మారుస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జూన్ నాటికి ఆసుపత్రిని ప్రారంభించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. MIR, ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి ఆధునిక సదుపాయాలతో పాటు కొత్తగా 14 విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైద్య రంగ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.