BHNG: ఎండలు ముదరనే లేదు జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు. రిజర్వాయర్ల నుంచి జిల్లాకు వచ్చే జలాలు సగానికి పడిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వట్టిపోయాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రజలకు కష్టాలు షురూ అయ్యాయి.