AP: కావలి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రన్నింగ్లో ఓ బోగి కింద నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలు నెల్లూరు సిటీకి చేరుకుంటున్న తరుణంలో లోకో పైలట్ అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు చైన్ లాగడంతో రైలును నిలిపివేశారు. బ్రేక్ షూలు జామ్ కావడం వల్ల రాపిడి జరిగి పొగలు వచ్చాయని సాంకేతిక నిపుణులు తేల్చారు.