KRNL: ఆదోని తుంగభద్ర దిగువ కాలువ-బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీటి పంపింగ్ ప్రక్రియను ఇవాళ కమిషనర్ నయీం అహ్మద్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవి కావడంతో అత్యవసర నీటి ఇబ్బందులను దూరం చేసుకునేందుకు తుంగభద్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రోజూ 4 మోటార్ల ద్వారా 90 మిలియన్ లీటర్ల నీటిని SS ట్యాంకుకు పంపింగ్ చేసుకుంటున్నామన్నారు.