WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం సర్పంచ్ బేతి సాంబయ్య పాల్గొని అడ్మిషన్ అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహార భోజనం అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీరాణి తెలిపారు.