NGKL: ఈ నెల 23న ప్రారంభమయ్యే సమరసత రథయాత్రను విజయవంతం చేయాలని వీహెచ్పీ ప్రాంత సభ్యుడు రాఘవేందర్ పిలుపునిచ్చారు. శనివారం సరస్వతీ ఆలయం వద్ద శివయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ సమాజ ఐక్యతే లక్ష్యంగా సాగే ఈ యాత్రకు గ్రామాల్లో ఘనస్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.