NLG: చిట్యాల ప్రమోద సాహితీ సంస్థ అధ్యక్షులుగా 35 సంవత్సరాలు సేవలందించిన సాహితివేత్త, రిటైర్డ్ లెక్చరర్ కందిమళ్ళ రాంరెడ్డి సంస్మరణ సభ ఈనెల 12న జరుగుతుందని ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కందిమళ్ళ కృష్ణారెడ్డి తాడూరి చంద్రంలు తెలిపారు. మండలంలోని ఉరుమడ్లలో గల వారి వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ సభకు సాహితీ మిత్రులు, కవులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.