NGKL: జిల్లా కేంద్రంలో టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బలరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో జిల్లా అధ్యక్షుడిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా సభా వెంకటేశ్, కోశాధికారిగా రమేశ్ బాబు బాధ్యతలు చేపట్టారు.