GDWL: జ్యోతిరావు ఫూలే కులవ్యవస్థకు వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని గద్వాల అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఫూలే జయంతి సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపంలోని విగ్రహానికి పూలమాలలు అర్పించారు. 1873లో పుణేలో సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి లింగ వివక్షను వ్యతిరేకించారని పేర్కొని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.