ADB: మహాత్మ జ్యోతిబా ఫులే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని సర్పంచ్ కుమ్ర ధర్ము అన్నారు. శనివారం నార్నూర్ మండలంలోని చొర్గావ్ గ్రామంలో జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్థులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. విద్య, సమానత్వం కోసం ఫూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.