ASF: తిర్యాణి మండల ఎస్సైగా పని చేస్తున్న వెంకటేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాగజ్ నగర్ టాస్క్ ఫోర్స్ ఎస్సైగా పనిచేసిన కాలంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధికారుల శాఖాపరమైన విచారణ నివేదిక ఆధారంగా డీఐజీ చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీస్ వర్గాల నుంచి అధికారిక సమాచారం అందింది.