SDPT: ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది 9,946 ప్రథమ సంవత్సర విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 10,089 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యా శాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు