GDWL: మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు అంధకారమవుతాయని, యువత వాటికి దూరంగా ఉండాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళిక, ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శనివారం కృష్ణవేణి చౌరస్తా నుంచి విద్యార్థులు, వైద్యాధికారులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తుకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు.