MDK: మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మత్తుపదార్థాల చికిత్స కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని ల్యాబ్లు, కౌన్సిలింగ్ విభాగం, చికిత్స విధానాలను పరిశీలించి, కేంద్రం పనితీరుపై వైద్యులకు పలు సూచనలు చేశారు. మత్తుపదార్థాలకు బానిసైన వారికి మెరుగైన వైద్యం అందించి, వారిని సాధారణ స్థితికి తీసుకురావాలని కోరారు.