BHNG: ఆలేర్ మండలం శారాజీపేట గ్రామ సర్పంచ్ కంతి మధు సోమవారం వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా యువత, ప్రయాణికులు రవాణా సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని ఆయన సూచించారు.