AP: చారిత్రక అమరావతి రాజధాని చట్టంపై సంతకం చేసిన రాష్ట్రపతి ముర్మును మంత్రి లోకేష్, ఎన్డీఏ ఎంపీలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్ ప్లాన్, రైతుల ఉద్యమ విశేషాలతో కూడిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు చట్టబద్ధత కల్పించినందుకు లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ హయాంలోనే అమరావతికి పునాది, పునర్నిర్మాణం జరిగాయని వివరించారు.