AP: జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ‘దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌గా.. జువ్వలదిన్నె అభివృద్ధి చెందబోతుంది. రూ.288.80 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశాం. 25 వేల మత్స్యకార కుటుంబాల జీవితాలు మారుతాయి. జువ్వలదిన్నెపై జగన్ విషం కక్కుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.