TG: రంగారెడ్డి(D)లోని వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శిక్షణ కేంద్రంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలను డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘనంగా ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.