కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తన ఉదారత చాటుకున్నాడు. నటుడు ప్రేమ్ కుమార్ తన కుమారుడి విదేశీ చదువుల కోసం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శివకార్తికేయన్ సాయం చేశాడు. ఆయన స్వయంగా పూచీకత్తుగా నిలిచి బ్యాంకు ద్వారా రూ. 50 లక్షల రుణం ఇప్పించాడని ప్రేమ్ తెలిపాడు. దీంతో నెదర్లాండ్స్లో తన కుమారుడు చదువు పూర్తి చేసి, ప్రస్తుతం నెలకు రూ. 4-5 లక్షలు సంపాదిస్తున్నాడని చెప్పాడు.