AP: ఎంపీ బీదా మస్తాన్ రావు సోదరులతో మాట్లాడితే లక్ష రూపాయల ఫైన్ విధిస్తామని మత్స్యకారుల సంఘం నిర్ణయించింది. MLC బీదా రవిచంద్ర, బీదా గిరిధర్లతో కూడా మాట్లాడకూడదని సొంత గ్రామం ఇస్కపల్లిపాలెంలో తీర్మానం చేశారు. పెద్దకాపు తోటయ్యని తమ సమాజం నుంచి బహిష్కరించే యోచనలో మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రేపు మాజీ సీఎం జగన్ జువ్వలదిన్నె హార్బర్లో పర్యటించనున్నారు.