BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుక సందర్భంగా ఇవాళ గ్రామ సర్పంచ్ నాండ్రే సునీత-రవీందర్, పాలకవర్గం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వరరావు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.