AP: కాఫీ కబుర్లు కార్యక్రమంలో TDP క్లస్టర్ ఇంఛార్జులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. రెడ్‌బుక్ సమాజ బాగు కోసం అని అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. గతంలో TDP కార్యాలయం, నేతలపై దాడులు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై జగన్ విషప్రచారం చేస్తున్నారని, వైసీపీ ఫేక్ సమాచారాన్ని ఐకమత్యంగా తిప్పికొట్టాలని వారికి సూచించారు.