KMM: వైరా మున్సిపాలిటీలో మంగళవారం డా.బి.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు నూతి సత్యనారాయణ గౌడ్, డాక్టర్ కాపా మురళీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని వారు కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.