SRD: సింగారెడ్డిలోని ఎమ్మెస్ క్రికెట్ మైదానంలో శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-25 క్రికెట్ ఎంపికలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల నుండి మొత్తం 122 మంది యువ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఎంపికైన క్రీడాకారులతో జిల్లా జట్టును ఏర్పాటు చేస్తామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.