NRPT: సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి రంగరావుపై ఎన్ఐఏ పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. పేదల కోసం పోరాడుతున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టడం అన్యాయమని శనివారం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కుట్రపూరిత కేసులను తొలగించకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.